Thursday, January 12, 2012

((***అజ్ఞాతంలో అజాతశత్రువు***))-STORY


Written By Wenkat

అదిగో... అట్టు చీకటికి ఇట్టు వెలుగుకు  మధ్య సమయం.అంతే తెల్లవారుతున్న సమయం. కోయిల తన స్వరపెటికతో ప్రపంచానే లేపుతుంది.లేవండోయ్...!! అంటూ  కోడి తన పలుకుతో నిద్రపోతున్న సింహాన్ని సైతం కూడా లేపుతుంది.
"అజ్ఞాతంలో ఉన్న చిన్న చీకటిని నాశనం చేయడానికి సూర్యుడు అజాత శత్రువులగా నెమ్మదిగా ఆకాశంవైపు దుసుకోస్తున్నాడు.

           అది బెంగుళూరు లోని జయనగర్ కాలనీ. ఒక్కే రూం లో నలుగురు కుర్రాలు " PRAKASH,PRAVEEN,SRIKANTH,SUBBU" ఉంటున్నారు. ఆ చల్లటి వాతావరణానికి ఈ నలుగురు కొత్త.అందరిది ఒక్కే ఊరు. ఒకరి తరువాత ఒకరు హడావిడిగా స్నానానికి వెళ్తునారు.కాని.. అప్పుడే నిద్రలేచిన "సుబ్బు".... లేవగానే దేవుడిని చూశాడు.ప్రశాంతమయిన వాతావరణం,ఆకాశంలో విహరిస్తున్న పక్షుల్ని,ప్రకృతి అందాలను చూసి తనను తాను మరిచిపోయాడు...ఇంతలో ప్రకాష్...! సుబ్బు.. త్వరగా వెళ్లి రెడీ అవ్వు...మొదటిరోజైన కాలేజీ కి టైం కి వెళ్దాము.కాసేపటికి "సుబ్బు" కూడా రెడీ అయ్యాడు.కొత్త పుస్తకాలు తీసుకొని, కొత్త కాలేజీ లో అడుగు పెట్టారు.ఆ నలుగురు.

           అదిగో అదే CMR LAW కాలేజీ..
ఆ నలుగురితో పాటు చాలామంది కొత్త విద్యార్థులు ఎక్కడ రాగ్గింగ్ చేస్తారోనన్ని క్యాంపస్  రోడ్లో బయం..బయంగా ముందుకు వెళ్తున్నారు.సీనియర్స్ అక్కడక్కడా బ్యాచ్లుగా  డివైడ్ అయ్యి విద్యార్థులను  రాగ్గింగ్  చేస్తున్నారు. వెళ్తున్న ఆ నలుగురిని సీనియర్స్ పిలిచి రాగ్గింగ్ చేయడం ప్రారంభించారు.ఒక్కొకరికి ఒక్కో విధంగా రాగ్గింగ్ చేస్తున్నారు.ఆ నలుగురిలో PRAVEEN కు గుండు కావడంతో సీనియర్స్ PRAVEEN ను,"నీ గుండుపైన ఒక వెంట్రుక పికిస్తే మీ నలుగురిని వదిలేస్తాం."అనడంతో. మిగిలిన ముగ్గరు PRAVEEN వైపు చూస్తారు.చేసేది ఏమిలేక తన గుండు పైన పైన వెంట్రుకను పికటానికి చాల ప్రయత్నిస్తాడు.
PART-2
           సీనియర్స్ బ్యాచ్లో ఒకడు పరుగునా వచ్చి... మామ ప్రిన్సిపాల్ వచ్చేస్తున్నాడురా...!!! అనగానే ..ప్రిన్సిపాల్ కారు కాలేజీ మెయిన్ గేటు దాటిరావడం చుసిన సీనియర్స్ అందరూ క్లాసురూంలోకి వెళ్ళిపొయ్యారు.ఆ ప్రిన్సిపాల్ మాటలతోనే ఉరి వేస్తాడు. వెంట్రుకలు పీకడంలో Busy అయిన PRAVVEN మాత్రం ఉపిరి పీల్చుకున్నాడు.
           నిశబ్దంగా ఉన్న క్లాసురూంలోకి ఆనలుగురు ప్రవేశించారు. ఆ క్లాస్కు అందరూ కొత్త.నలుగురు మాత్రం ఒక్కే బెంచ్లో కూర్చున్నారు.అందరూ నిశబ్ధంగా ఉంటే వీళ్ళుమాత్రం ఒకరికి..ఒకరు మాటల్లో నిమగ్నమైపోయారు.
           అంతలో....!!!!!
           ఆ కాలేజీ ప్రిన్సిపాల్ VENKATACHARYA క్లాసురూంలోకి వచ్చాడు.విద్యార్థులు గుడ్ మార్నింగ్ సార్...!! అంటూ పైకి లేచారు. గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చోమన్నాడు. అందరూ ప్రిన్సిపాల్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు.మా తల్లిదండ్రుల కళ్ళలను తీర్చండి,మీ ఆశలను నెరవేర్చుకొంది.బాగా చదివి దేశంలో అన్యాయాలను తొలగించండి,నిర్దోషులను కాపాడండి,దోషికి శిక్షపడకపోయిన పర్లేదు..ఆ దోషి మరెప్పుడైన దొరకపోడు..కాని ఏ ఒక్క నిర్దోషికి శిక్షపడకూడదు.అది మన బాధ్యత అని చెప్పి వెళ్ళిపోతాడు.
          మాస్టర్ SIVAAIAH క్లాసులోకి వచ్చాడు... మొదటి రోజు  అయినందున కొత్త విద్యార్థులను మాస్టర్ SIVAAIAH ఒక్కోకరిని లేపి వరుసగా పేర్లను, ఏ ప్రాంతం నుండి వచ్చారో మొదలగు విషయాలు తెలుసుకోవడం ప్రారంబించాడు.Subbu దెగ్గరకు వచ్చేసరికి "మే ఐ కంఇన్ సర్..." అంటూ ఒక అమ్మాయి వాయిస్.. 'ఎస్' కం ఇన్ అని లోపలి పిలిచాడు. ఆ అమ్మాయి భయం..భయంగా లోపలి వచ్చింది.ఆ అమ్మాయి చాలా సింపుల్ గా ఉంది,ప్రాణంతో నడిచోస్తున్న  బాపు బొమ్మలా ఉంది.వెన్నెలను తన చుట్టూ కప్పుకున్నట్లు ఉంది.మొదటిరోజే ఎందుకు లేట్ అయింది అని మాస్టర్ Sivaaiah ఆమెను ప్రశ్నించాడు.మా అమ్మమ రహువుకాలం దాటినాక కాలేజీకి వెళ్లమంది సార్..!! అంటూ చిలిపిగా సమాధానం ఇచ్చింది.సరే వెళ్ళు...!! కూర్చో అంటాడు..ఆ అమ్మాయి నెమ్మదిగా అడుగేసుకుంటూ నిలబడిఉన్న సుబ్బు వైపు చూసి ముందర బెంచ్ కాళీ లేకపోవడంతో వేనుకబెంచ్ లో కుర్చుంది.ఈ మధ్య సమయం లో...సుబ్బు ఆ అమ్మాయిని చూడగానే ఉపిరుతీసుకోవడం మానేశాడో లేక ఆ అమ్మాయి తన సొంతం అనుకున్నాడో తెలియదు.తనని అలా చూస్తూ ఉండిపోయాడు..ఇంతలో మాస్టర్....! నిలబడిన సుబ్బు ని క్లాస్ కి  పరిచేసుకోమ్మన్నాడు.
          అమ్మాయిల్ని కూడా క్లాస్ కు పరిచయం చేయండి సార్..!! అంటూ మూలనుంది గట్టిగా అరిచాడు Girish.అమ్మాయిలు ఒక్కొకరు క్లాస్ కి పరిచయం చేసుకుంటున్నారు.లేట్గా వచ్చిన అమ్మాయి లేచి నా పేరు "రమ్యాసరయు" అని చెప్పి కూర్చుంటుంది.
          అంతలో ఆ క్లాస్ అయిపోతుంది....
          బయటకు  వెళ్తే సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారని అందరూ క్లాస్ రూం  లో ఉండిపోయారు.సుబ్బు.. రమ్యా ని చూస్తూ ఉండిపోయాడు...
          అలా కొన్నిరోజులు గడిచిపోయాయి....
          క్లాస్ లో రమ్యా వైపు సుబ్బు చూస్తున్నాడని రమ్యా కి తెలుసు.చూసి చూడనట్లుగా ఉండేది...
PART-3
 రమ్య:-క్లాసు రూం లో నా వెనుక బెంచ్ లో కూర్చుంటున్న "ధీరజ్, మాదేశ్,శంకర్, ఆ ముగ్గరు నన్ను తెగ అల్లరిపంటించే వాళ్ళకు  కాలేజీ లో.చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను కానీ పలితం లేదు.వాళ్ళు మాత్రం అల్లరి మానలేదు.నాకు కోపం వచ్చినప్పుడల్లా వాళ్ళను కొట్టాలనిపించేది.కాని... అంత ధైర్యం నాకు లేదు.
          ఒకరోజు నేను క్లాసు రూం లోకి వచ్చి నా బెంచ్ లో కూర్చున్నాను. కోదిసేపటికే "ధీరజ్","మాదేశ్","శంకర్" నా బెంచ్ లో కూర్చొని నన్ను అల్లరి పెట్టడం ప్రారంభించారు.సుబ్బు అతని స్నేహితులు క్లాసురూం లోకి వచ్చారు .నన్ను ఏడిపిస్తున్న ఆ ముగ్గరిని గమనించిన సుబ్బు...!!శంకర్ భుజంపైన చెయ్యి వేసి, తప్పని..కళ్ళు ఎర్రగా చేసి తల అడ్డంగా తిప్పాడు.సుబ్బు కళ్ళలో ఏ మేరుపు మేరిసిందో గాని వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయారు..అసలు ఏం జరిగిందో,ఏం జరుగుతుందో నాకు ఏమి అర్థం కావటం లేదు.ఇదంతా ఆలోచించేలోపే క్లాస్ లోకి ప్రొఫిసర్ " శివయ్య" గారు వచ్చి క్లాస్ మొదలుపెట్టాడు.నేను మాత్రం సుబ్బు వైపు చూస్తున్నాను.నేను అతని వైపు చూస్తున్నట్లు గమనించాడేమొగాని.. అతను నావంక చూశాడు.చట్టుక్కున చూపు మార్చుకున్నాను. ఆకోదిసేపటికే మా చుపులమధ్య ఏదో శక్తివంతమైన మేరుపు మేరిసింది.
 సుబ్బు:- ఏరోజు నావైపు చూడని రమ్య మొదరిసారి నాపైపు చూసింది.ఆ రోజు నుండి మేమిద్దరం చుపులద్వారనే పలకరించుకోవడం జరుగుతుండేది.నేను నిద్రపోతున్నప్పుడు నా కలలో ఆమె..నేను ఏవేవో మాటలు చెప్పుకునేవాళ్ళము.ఇది ప్రేమో ..తెలియని స్నాహమో నాకు అర్థం కావటం లేదు.రమ్యతో ఒక్కసారైనా మాట్లాడాలి.
             ********************************************************
రమ్య:- అది వర్షాకాల సమయం..
          నా స్నేహితురాలు  "నిర్మిత" పుట్టినరోజు కావడంతో డిన్నర్ కి ఇంటికి పిలిచింది.అక్కడ కాసేపు స్నాహితులందరం అంతాక్షిరి ఆడుకున్నాము.వర్షపు మబ్బులు ఆకాశమంతా కమ్మేశాయి.ఏక్షణమైన వర్షం రావచ్చు.కాసేపు ఉంటే వర్షం పడుతుందని ఇంటి ముఖం పట్టాను.విపరీతమైన గాలి. ఆ గాలికి అక్కడక్కడ చెట్లు రోడ్లపై పడి నిద్రపోతున్నాయి.ఆ రూట్  లో బస్సులు రావటం లేదు.


ఒంటరిగా నడుస్తూ వెళ్తున్నాను.చిన్న..చిన్న చినుకులతో మొదలుపెట్టిన వర్షం పెద్దగా  కురుస్తుంది..వర్షానికి వెళ్ళలేక ఓ చెట్టు కింద నిలబడ్డాను..ఓ పక్క భయం..ఓ పక్క వర్షం..కొద్దిసేపటికి ఆటో వస్తుండటం చూశాను.ఆపటానికి ప్రయత్నించాను కానీ..ఆగలేదు.కాస్త ముందుకు వెళ్లి ఆటో ఆగింది.ఆటో కోసం వెళ్ళాను.కానీ ఆ ఆటో లో ఏవరో ఉన్నారు...పర్వాలేదు "రమ్య" కూర్చో..!! అంటూ ఆటోలో కూర్చున్న వ్యక్తి పిలిచాడు..నన్ను పేరు పెట్టు పిలవగానే షాక్ అయ్యాను,ఎవ్వరా...అని ఆసక్తి గా చూశాను.
 నేను "సుబ్బు" ని "రమ్య"....!!! అన్నాడు..
ఒక రకంగా చెప్పాలంటే భయం పోయి చాలా సంతోషం వేసింది.ఆటోలో కూర్చున్నాను.ఎప్పుడు కళ్ళతో మాట్లాడుకునే మేము ఈ సారి గొంతు విప్పి మాట్లాడుకున్నాము.
సుబ్బు:- ఈ టైం లో ఎక్కడికి వెళ్లి వస్తున్నావు రమ్య...!!
రమ్య:- మన క్లాస్లో "నిర్మిత" ఉంది కదా..?? తన పుట్టినరోజు పార్టీ కి వెళ్లి వొస్తున్నాను..ఇంతలో వర్షం వల్ల ఈ కష్టం వచ్చింది.
డ్రైవర్:- సార్..! రోడ్ పై చెట్టు పడి ఉంది ముందుకు వెళ్ళడం కష్టం.

part 4:-                  
ఆటో  వాడికి  డబ్బులు ఇచ్చి చేతిలో ఉన్న గొడుగు తెరిచాడు.రమ్య.. ఈ గొడుగు తీసుకో.మరి నీకు వోదా గొడుగు అంటుంది రమ్య..ఈ చిన్న గొడుగులో ఇద్దరం వొస్తే ఇద్దరం తడుస్తాము.పర్వాలేదులే "రమ్య" ను తీసుకో గొడుగు అంటాడు..
  
రమ్య:- సుబ్బు వర్షంలో తడుస్తూ నా పక్కన వొస్తునాడు.ఎంత చెప్పినా వినలేదు.బంగాళకాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావమో లేక ఆ దేవుడు ఆడించే నాటకమో తెలియదు కానీ..ఇలా అతని పక్కన నడుస్తూ వెళ్తున్నాను .అతనితో కలిసి నడిపించటనికే కాబోలు ఈ నాటకం లో వర్షం.
సుబ్బు:- ఏంటి రమ్య ఆలోచిస్తున్నావు..??
రమ్య:- ఆహ..ఏమి లేదు...అమ్మమ్మ ఒక్కరే ఉంటారు,తను బయపడుతుంటుంది.త్వరగా వొస్తాను అని చెప్పి వచ్చాను.అదే ఆలోచిస్తున్నాను..
సుబ్బు:- కాస్త ముందుకేల్తే STD బూత్ ఉంది అక్కడనుండి ఇంటికి ఫోన్ చేసి చెప్పు.
రమ్య:- పర్లేదులే..ఇక్కడనుండి ఇల్లు దెగ్గరే.ఎలాగో ఇంటికే కదా వెళ్తున్నాను.
                   అలా మాటల్లో మునిగిపోయారు.ఇంతలో రమ్య ఇల్లు వచ్చింది.
రమ్య:- సుబ్బు..!! ఇదే మా ఇల్లు...
                  రమ్య కోసం ఎదురుచూస్తున్న వాళ్ళ అమ్మమ్మ...అమ్ముల్లు ఏమి ఇంత లేట్.వర్షం పడేలా ఉంది అంటే వినవు కాదు..
రమ్య:- అబ్బా...!! అమ్మమ్మ... వచ్చేశాను కదా..?? 
రమ్య అమ్మమ్మ:- ఎవ్వరు ఈ అబ్బాయి..??
రమ్య:- హయ్యో ... అమ్మమ్మ ఇలా వర్షం లో నిలబెట్టి అడుగుతవాఎంటి...?? సుబ్బు... ఇప్పటికే చాలా తడిశావు లోపలి రా..
సుబ్బు:- పరవాలేదులే రమ్య...!! ఆ పక్క వీధిలోనే మా రూం..
రమ్య అమ్మమ్మ:- వర్షం తగ్గాక వెళ్ళు బాబు.
             సరే అని చెప్పి.. రమ్య ఇంట్లోకి వెళ్తాడు. వర్షం లో తడిసిన సుబ్బు కి రమ్య అమ్మమ్మ టవల్ ఇస్తుంది.
రమ్య:- సుబ్బు...!! కాసేపు ఆగు కాఫీ తీసుకొస్తాను..
సుబ్బు:- సరే రమ్య 
రమ్య అమ్మమ్మ:- మీది ఏ ఊరు బాబు..
సుబ్బు:- మాది కడప..నా చదువు కోసం ఇక్కడకు వచ్చాను అమ్మమ్మ..
రమ్య అమ్మమ్మ:- కడప నా..?? మది తూర్పు గోదావరి.. రమ్య అమ్మ,నాన్న రమ్య కు 10 సంవత్సరాల వయస్సులోనే ఆక్సిడెంట్లో చనిపోయారు.అప్పటి నుండి నాతో ఉంటుంది.తల్లిదండ్రులు లేరని చాలా గారాబం గా  పెంచాను. తన చదువుకోసం కాదనక బెంగుళూరు కి వచ్చాను.మాకు ఇక్కడ ఎవ్వరు తెలియదు.తనని హాస్టల్ లో  పెట్టి వెళ్దామంటే నాకు తనని విడిచి ఉండటం సాధ్యం కాదు.తను ఒంటరిగా ఉండలేదు.అందుకే కష్టం అయిన నష్టం అయిన తన మాట వింటాను.తనను బాధపెట్టకుండా.రమ్య వొస్తుంది నేను మీతో ఇలా చెప్పాను అని తెలిస్తే తను కోపడుతుంది.
రమ్య:- కాఫీ రెడీ...!!! సుబ్బు తీసుకో..హ.. అమ్మమ్మ.. చెప్పడం మరిచాను.ఇతను సుబ్బు అని నా క్లాస్మేట్..నిర్మిత ఇంటినుండి వచ్చేటప్పుడు తను కూడా అదే రోడ్లో వొస్తున్నాడు. అలా మేమిద్దరం కలిశాము. వంటరిగా వొస్తున్న ఇంటిదేగ్గర వదులుతా అంటే సరే అన్నాను..
రమ్య అమ్మమ్మ:- నాకు ఈ అబ్బాయి అంతా చెప్పాడు.
               ***వర్షం తగ్గుముఖం పటింది.
సుబ్బు:- సరే రమ్య మరి నేను వేల్లోస్తాను వర్షం కూడా తాగింది. వేల్లోస్తాను అమ్మమ్మ
రమ్య:- సరే....జాగ్రత్త....హ సుబ్బు నీ గొడుగు మరిచిపోయావు.
రమ్య అమ్మమ్మ:- సరే బాబు జాగ్రత్త.

PART-5 
              సుబ్బు:- మరుసటిరోజు యధావిధిగా కాలేజీ కి వచ్చాను.మొదటి బెంచ్ లో ఉన్న రమ్యని చూసి నవ్వి నా బెంచ్లో కూర్చున్నాను.ఏమయిందో తెలియదు మొతానికి ఏదో ఆలోచిస్తున్నాను.ఆలోచన కోతగా ఉంది.నా ఆలోచనలో ఉన్నది రమ్య.. ప్రేమ...?? లేక ఆకర్షణా...?? కాదు..ఇది ప్రేమే...ఎస్.. ప్రేమని మనస్సులో పెట్టుకొని గుండె బరువును పెంచడం అంత మంచిది కాదు..ఈ రోజే నేను ప్రేమిస్తున్నాని రమ్య కి చెప్పాలి....రేయ్ శ్రీకాంత్ ఏంటి ప్రొఫెసర్ శివయ్య వచ్చి క్లాస్ చెప్పకుండా వెళిపోతున్నాడు.
శ్రీకాంత్:- బాబు.....బేతాళ మాంత్రికుని హృదయము సప్త సముద్రాల పక్కన ఉన్న ఒక దీవిలో దాచినట్లు నీ హృదయాని కూడా ఏ అమ్మాయికైనా ఇచ్చి మరిచిపోయవేమో మిత్రమా...???
సుబ్బు:- ఆపరా నీ సంస్కృతం........ఇక ఆలశ్యం చేస్తే మంచిది కాదు.వెంటనే వెళ్లి రమ్య కి చెప్పాలి.
                 బ్రేక్ టైం లో రమ్య తో మాట్లాడటానికి వెళ్తాడు.
సుబ్బు:- రమ్య......!!! నీతో మాట్లాడాలి.
రమ్య:- చెప్పు సుబ్బు ..
సుబ్బు:- ఇప్పుడు కాదు రమ్య...రోడ్ నెంబర్ 4 లో ఉన్న హోటల్ సంగమిత్ర టేబుల్ నెంబర్ 14,15 లో సాయంత్రం 5pm కి వెయిట్ చేస్తుంటాను.
            ***చెప్పి వెళ్ళిపోతాడు***
రమ్య మనస్సులో:- ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు.ఎంత ఆలోచిన ఏమి అర్థం కావటం లేదు.సరే సాయంత్రం ఏం మాట్లాడతాడో..??
        సాయంత్రం సుబ్బు 4pm నుండి వెయిట్ చేస్తుంటాడు రమ్య కోసం.రమ్య కి ఎలా చెప్పాలా అని మనస్సులో ప్రాక్టీసు చేసుకున్నాడు.ఏం మాట్లాడాలో కూడా పేపర్ లో రాసుకున్నాడు.
        సాయంత్రం 5pm అయింది.
సుబ్బు మనస్సులో:- ఏంటి ఇంకా రమ్య రాలేదు..??? వొస్తుందా..?? రాదా...??? వొస్తే నా ప్రేమ విషయం చెప్తాను.ఒకవేళ రాకుంటే ఒక మంచి ఫ్రెండ్ గా మిగిలిపోతాను.....హ.. వస్తుంది హమ్మయ్య...
సుబ్బు:- హాయ్ రమ్య.
రమ్య:- హాయ్..లేట్ అయిందా..??
సుబ్బు మనస్సులో:- నువ్వు వొస్తావా??? రావా ?? అని ఆలోచనలో ఉన్నాను...ఇక లేట్ గురించి ఏమి థింక్ చేస్తాను.
సుబ్బు:- ఆహ...అదేమి లేదు రమ్య...
సుబ్బు:- Waiter.............???
వైటర్:- గుడ్ ఈవెనింగ్ సర్....!!!
సుబ్బు:- రమ్య నువ్వు ఏం తీసుకుంటావు...?
రమ్య:- నాకు కాఫీ చాలు.
సుబ్బు వైటర్ తో:- రెండు కాఫీ.లేట్ అయిన పర్లా...
సుబ్బు:- రమ్య నీతో ఒకమాట చెప్పాలి.ఎప్పటినుండో చెప్పాలనుకుంటున్నాను.
రమ్య:-చెప్పు
సుబ్బు:-రమ్య మరి అది...... నీ డ్రెస్ బాగుంది.


రమ్య:-నువ్వు చుసిన ప్రతిసారి నేను ఒక్కే డ్రెస్ లో కనిపిస్తున్నాన నీకు.పిలిచింది డ్రెస్ బాగుంది అని చెప్పడానికేనా పిలిచావు??
సుబ్బు:-ఆహ... అది కాదు....... ఐ లవ్ యు  రమ్య

PART-6

          **** లవ్ చేస్తున్నావా అన్నట్లు ఆశ్చర్యం గా చూస్తుంది సుబ్బు వైపు.
సుబ్బు:-రమ్య నిన్ను చుసిన మొదటిక్షణం నుండే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను.
రమ్య:- సడన్ గా పిలిచి ఐ లవ్ యు అని చెప్తే నాకు ఏమి చెప్పాలో అర్థం కావటం లేదు.
సుబ్బు:- సడన్ గా అని కాదు రమ్య.నిన్ను ప్రేమిస్తున్నాని నిజం.ఈ నిజాన్ని ఏదోకరోజు నీకు చెప్పకతప్పదు.. అప్పుడైనా ఇప్పుడైనా నీకు చెప్పాల్సిందే...ప్రతి క్షణం,ప్రతి నిమిషం నిన్ను ఫాలో అవుతున్నాను..
రమ్య:- ఏమో....ఏమి చెప్పాలో తెలియటం లేదు..
రమ్య మనస్సులో:- ఈ రోజు కోసమే సుబ్బు నేను వెయిట్ చేశాను.నేను నిన్ను లవ్ చేస్తున్నాని నీకు  వెంటనే చెప్పాలనుంది సుబ్బు ఎంతైనా అమ్మాయిని కదా..బయంతోనో మరి సిగ్గుతోనో నీకు ఆ సమాధానం చెప్పలేకపోతున్నాను.
సుబ్బు:- రమ్య ఏం ఆలోచిస్తున్నావు.?? నా అభిప్రాయం చెప్పాను..నీ అభిప్రాయం కోసం...

 ******ఇంతలో వైటర్ కాఫీ తీసుకొచ్చాడు....మౌనంగా ఇద్దరు కాఫీ తాగుతున్నారు...సుబ్బు మాత్రం రమ్య చెప్పే మాట కోసం ఎదురు చూస్తున్నాడు..ఒక్కసారిగా ఉరుములు..జోరుగా వర్షం మొదలయింది.
రమ్య:- సుబ్బు..వర్షం పడుతుంది నేను వెళ్ళాలి అమ్మమ్మ ఒక్కరే ఉంటారు..
సుబ్బు:- సరే రమ్య..
     **** బిల్ కట్టి బయటకు వచ్చారు ఇద్దరు..

సుబ్బు:- ఆటో........!!!! జయనగర్ కాలనీ కి.....
   ****రమ్య వెళ్లి ఆటో లో కూర్చుంటుంది..
సుబ్బు:- రమ్య నీ అభిప్రాయం కోసం....?????
రమ్య:- నా అభిప్రాయం....నిర్ణయం రేపు కాలేజీ లో చెప్తాను...సరే మరి వేల్లోస్తాను.
సుబ్బు:- సరే రమ్య.....

         మరుసటిరోజు కాలేజీ క్లాస్లో రమ్య సుబ్బు కోసం ఎదురు చూస్తుంటుంది తన అభిప్రాయం చెప్పడానికి.ఒక్కొక్కరు  క్లాస్ రూం లో కి   వొస్తున్నారు..ఇంతలో స్టూడెంట్స్ అందరు క్లాస్ రూం బయట పరుగులుతీస్తారు..రమ్య కూడా బయటకు వెళ్తుంది ఏం జరిగిందా అని...?? నాల్గు సుమోలు కాలేజీ కాంపస్ నుండి బయటకు వెళ్తుండటం చూస్తుంది.అయినా ఏమి అర్థం కావటం లేదు రమ్య కి..అక్కడేదో జనాలు గుంపుగా ఉండటం గమనించిన రమ్య అక్కడికి వెళ్తుంది..ముందుకు వెళ్లి చూసింది.రక్తంతో పడిఉన్న సుబ్బు ని చూడగానే సుబ్బు..........అని గట్టిగా   అరుస్తుంది..లే...సుబ్బు....లే.... ఐ లవ్ యు సుబ్బు..లే సుబ్బు..నా నిర్ణయం చాల సంతోషంగా చెప్పాలనుకున్నాను.ఇలా చెప్తున్నానే అని భోరున ఏడుస్తుంది..

PART-7
         అదితెలుసుకున్న సుబ్బు ఫ్రెండ్స్ వెంటనే హస్పిటల్ కి తేసుకేల్తారు.రమ్య కూడా వెళ్తుంది.త్వరగా ఆపరేషన్ చేయాలనీ డాక్టర్ చెప్తాడు.రమ్య కి ఏమి అర్థం కావటం లేదు. అంతా  క్షణాలలోనే జరిగిపోయింది.బాధపడుతున్న  రమ్య ని శ్రీకాంత్ వచ్చి ఓదారుస్తాడు. సుబ్బు కి ఆపరేషన్ చేసిన డాక్టర్ బయటకు వొస్తాడు.
రమ్య:-డాక్టర్ సుబ్బు కి ఎలా ఉంది.???
డాక్టర్:- మరేమీ పర్లేదు..త్వరగా తీసుకొచ్చారు..లేకుంటే మీరు బాధపడేవారు..ఇక్కడ రమ్య అంతే మీరేనా..??
రమ్య:- అవును డాక్టర్.
డాక్టర్:- తను మిమ్మల్ని చూడాలని కలవరిస్తున్నాడు.ఇప్పుడే ఆపరేషన్ అయ్యింది కాసేపయ్యాక వెళ్ళండి.
శ్రీకాంత్:- రమ్య డాక్టర్ చెప్పారు కదా పర్లేదు అని.ఏమి కాదులే బయపడకు.
రమ్య:- అసలు ఏవరువాళ్ళు  ...సుబ్బు ని చంపనికి వాచ్చినవాళ్ళు ఏవరని  ఆవేశంగా అడుగుతుంది.

 ఇంతలో నర్స్ వచ్చి రమ్య అంతే మీరేనా?? మిమ్మల్ని కలవరిస్తున్నారు లోపలికి రండి అని చెప్తుంది..ఏడుస్తూ లోపలి వెళ్తుంది రమ్య.
సుబ్బు:- రమ్య ఎందుకు ఏడుస్తున్నావు.ఏమయిందని ఇప్పుడు.
రమ్య:- అసలు ఏమి జరిగిందో..ఏమి జరుగుతుదో అర్థం కావటంలేదు.ఏవ్వరు వాలంతా..
సుబ్బు:- అదంతా తరువాత చెప్తాలే రమ్య.నువ్వు ఏడవకు ప్లీజ్.నేను బానే ఉన్నాను.ముందు కన్నీలు తుడుచుకో...కాలేజీ లో నువ్వు గట్టిగా అరిచావు కదా..?? అప్పుడు సరిగా  వినపడలా రమ్య ఇప్పుడు మల్లి చెప్తావ..??
రమ్య:- నా అభిప్రాయం చెప్దామనే నేను ముందుగా కాలేజీ కి వచ్చాను.ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో చెప్తానని అనుకోలేదు ఐ లవ్ యు సుబ్బు.నువ్వంటే నాకు కూడా ఇష్టమే.
సుబ్బు:- హ.... చాలా సంతోషంగా ఉంది రమ్య ఇలా ఐ లవ్ యు చెప్పాక..నొప్పి అస్సలు తెలియటం లేదు..ఏమి బాధపడకు..... మరేమీ పర్లేదు అని డాక్టర్ కూడా చెప్పారుగా..ఇప్పటికే లేట్ అయింది అమ్మమ్మ ఒక్కరే ఉంటారు నువ్వు వెళ్ళు రమ్య.ఫ్రెండ్స్ ఉన్నారులే..బయట శ్రీకాంత్ ఉంటాడు పిలుస్తావ..??
 రమ్య:- సరే సుబ్బు జాగ్రత్త.ఉదయం నేను అమ్మమ్మ వొస్తము నువ్వు రెస్ట్ తీసుకో..వేల్లివోస్తాను మరి.

            శ్రీకాంత్ లోపలి వొస్తాడు...
శ్రీకాంత:- ఎలా ఉంది రా.....!!! నిన్ను ఎందుకు నాగ భూషణం టార్గెట్ చేశాడు.నువ్వు ఇక్కడ ఉన్నవని వాళ్లకు ఎలా తెలిసింది..??
సుబ్బు:- అదంతా ఆలోచించడానికి ఇప్పుడు నేను ఒక్కడిని కానురా నాకు రమ్య తోడుగా ఉంది.ఈ ఏవిషయం ఇంతటితో వదిలేయ్ మల్లి వచ్చారంటే అప్పుడు చూద్దాము.రమ్య కి ఏమి చెప్పకు. రమ్య ని ఇంటిదేగ్గర వదిలేసి రా  తరువాత మాట్లాడుదాము.ప్రవీణ్, ప్రకాష్ ని రమ్మని చెప్పు.
ప్రవీణ్,ప్రకాష్ లోపలి వొస్తారు.
సుబ్బు:- ఈ విషయం గురించి ఇంట్లో తెలియకూడదు..ప్రిన్సిపాల్ కి చెప్పండి.ఇంటివరకు ఈ విషయం వెళ్ళకూడదు.ప్రవీణ్ నువ్వు ఇంటికి మాములుగా ఫోన్ చెయ్.ఒకవేళ వాళ్లకు ఈ విషయం తెలిస్తే వెంటనే అడుగుతారు.అడగలేదంతే వాళ్లకు తెలియనట్లు..నువ్వు ఏమి చెప్పకు సరేనా..??


PART-8     
ప్రవీణ్.... సుబ్బు ఇంటికి ఫోన్ చేస్తాడు..వాళ్ళకు ఏమి తెలియదు..
సుబ్బు అమ్మ:- మా అబ్బాయి ఎలా ఉన్నాడు ప్రవీణ్.వేలకు తింటున్నడా లేదా..?? ఫోన్ చేసి పదిరోజులు అయింది.నువ్వైనా చెప్పు బాబు.
ప్రవీణ్:- సరే ఆంటీ ఉంటా మరి..
                 ****మరుసటిరోజు సుబ్బుని చూడటానికి రమ్య,రమ్య అమ్మమ్మ వొస్తారు.కాసేపు ఉంది వెళ్ళిపోతారు.
                 ***పదిరోజులతరువాత సుబ్బు హాస్పిటల్ నుండి డిసఛార్జ్ అవుతాడు.ఏమి జరగనట్టుగా సుబ్బు కాలేజీ కి వొస్తాడు.
      @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
                          ***ప్రశాంతమైన కాలేజీ వాతావరణం లో వాళ్ళ 'లా' చదువు రెండు సంవత్సరం పూర్తి చేసుకొని మూడవ సంవత్సరం లోకి అడుగుపెడుతుంది.అలాగే సుబ్బు,రమ్య ల ప్రేమ కూడా మూడవ సంవత్సరం లోకి అడుగుపెడుతుంది.ప్రేమించడంలో ఒక్కరిని మించి ఒక్కరు.చదువులో మాత్రం వాళ్లకు వాళ్ళే శత్రువులు...
           *** ఒకరోజు ఉదయానే సుబ్బు కి  రమ్య ఫోన్ చేస్తుంది.
రమ్య:- సుబ్బు వెంటనే ఇంటికి రా....(రమ్య ఏడుస్తూ...)
సుబ్బు:- ఏమయింది రమ్య..ఎందుకు ఏడుస్తున్నావు...?? ఇప్పుడే వొస్తున్నాను...
     రమ్య ఇంటికి వొస్తాడు సుబ్బు.
సుబ్బు:- ఏమయింది రమ్య..అమ్మమ్మ ఎక్కడ..?? నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి..??
రమ్య:-ఏమయిందో తెలియదు సుబ్బు..!!! ఎంత లేపినా లేవటంలేదు..నాకెందుకో  భయంవేసి నిన్ను రమ్మన్నాను..

   ***సుబ్బు వెళ్లి చూస్తాడు.....
సుబ్బు:- రమ్య...!!! అమ్మమ్మ ఇక లేరు ర....
రమ్య:- అమ్మమ్మ...........నువ్వు చెప్పిన మాట వింటా అమ్మమ్మ లే....అమ్మమ్మ..సుబ్బు నువ్వైనా చెప్పు సుబ్బు మన పెళ్ళికి అమ్మమ్మ రారంట....చెప్పు సుబ్బు లేగమని చెప్పు.
    ఏడుస్తున్న రమ్య ని సుబ్బు ఒదార్చలేకపోతాడు..రమ్య ఏడుస్తూనే ఉంది...సుబ్బు వాళ్ళ ఫ్రెండ్స్ ని రమ్మని చెప్తాడు..రమ్య ఫ్రెండ్ స్వాతి కూడా వస్తుంది.
సుబ్బు:- రమ్య ప్లీజ్ రమ్య ఏడవకు... స్వాతి నువైన కాస్త చెప్పు ప్లీజ్..ఉదయం నుండి అలానే ఉంది..నాకేమో ఏమి అర్థం కావటంలేదు. జరగాల్సిన కార్యక్రమం చూడాలి.
రమ్య:- సుబ్బు...ఇక్కడ ఏమి వద్దు.మాఊరు వెళ్దాము.నా చదువుకోసం అమ్మమ్మ నాతో వచ్చారు.ఇక్కడ అమ్మమ్మ ఒంటరిగా వద్దు.మా ఊరిలొ అమ్మమ్మకు తోడుగా అమ్మా,నాన్న ఉన్నారు.(రమ్య ఏడుస్తూ)
సుబ్బు :- సరే రమ్య..నేను వెళ్లి అంబుల్లెన్స్ తీసుకొస్తాను...స్వాతి జాగ్రత్త.

           సుబ్బు వెళ్లి  అంబుల్లెన్స్ తీసుకోస్తాడు .అమ్మమ్మని తీసుకొని రమ్య వాళ్ళ ఊరికి వెళ్తారు.వాళ్ళతో పాటు సుబ్బు ఫ్రెండ్స్ కూడా వెళ్తారు.అక్కడ జరగాల్సిన కార్యక్రమం అంత సుబ్బు ఫ్రెండ్స్ చూసుకుంటారు.రమ్య కి తోడుగా సుబ్బు రమ్యతో ఉంటాడు..రమ్య మాత్రం ఏడుస్తూ అమ్మమ్మతో మాట్లాడుతుంది ఏడుస్తూ.
శ్రీకాంత్:- సుబ్బు అంత రెడీ రా...సూర్యాస్తమయం లోపే అంతా అయిపోవాలిరా....
            జరగాల్సిన కార్యక్రమం అంతా అయిపోతుంది.
రమ్య:- సుబ్బు ఇక నాకు ఏవ్వరు లేరు.నేను అనాధని.
సుబ్బు:- ఛ..అదేమి మాట రమ్య.నేకు నేను ఉన్నాను.
రమ్య:- సుబ్బు మనం ఇక్కడే ఉంధాము(అమాయకంగా అడుగుతుంది)
సుబ్బు:- సరే రమ్య మల్లి ఉదయం వస్దాము.సరే నా...
         రమ్యని తీసుకొని బెంగళూర్ కి వెళ్తాడు.

PART-9
          బెంగళూరు కి చేరుకుంటారు.సరదాగా ఉండే రమ్య ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది.సుబ్బు..! స్వాతి కి ఫోన్ చేశాడు.
సుబ్బు:- స్వాతి... రమ్య ని తీసుకొని ఇప్పుడే బెంగళూరు కి వచ్చాను.రమ్య ని నీదేగ్గరకి తీసుకొస్తాను.తను నిన్నటినుండి రమ్య ఏమి తినలేదు.నువైన కాస్త ధైర్యం చెప్పు స్వాతి.
స్వాతి:- సరే  సుబ్బు. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను రమ్యని తీసుకురా..
 అల స్వాతి ఇంట్లో రమ్య ని వదిలి రమ్య కి ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు..

మరుసటి రోజు కాలేజీ లో రమ్య సుబ్బు కలుసుకుంటారు.
రమ్య:-చిన్నపుడే అమ్మ,నాన్నని పోగొట్టుకున్నాను.అప్పటినుండి ఇప్పటివరకు అమ్మ, నాన్న లేని లోటు తీర్చి అన్నీ తానై  అమ్మమ్మ పెంచ్చారు.అమ్మమ్మకు  తెలుసు నేను ఒంటరిగా బ్రతకలేనని అలాంటిది ఇప్పుడు నన్ను ఒంటరిని  చేసి వెళ్ళిపోయారు.అంతా కొత్తగా ఉంది సుబ్బు..కడుపు నిండినంతవరకు జలగ రక్తం తాగుతుంది కాని  ఏముందని  దేవుడు ఇంకా నా జీవితంతో ఆడుకుంటున్నాడు.
సుబ్బు:-ఇలా ఏదో జరుగుతుందని  ముందుగానే తెలిసి దేవుడు నన్ను నీకు తోడు పంపాడు రమ్య.కళ్ళుముసుకొని  నిద్రేపోతే  రాత్రి  ఒక  నిమిషం,బాధలు ఉన్నాయని  కూర్చొని  బాధపడుతే  జీవితం  ఒక యుగం.నీ కష్టం లో నష్టం లో తోడుగా నేను ఉంటాను రమ్య.నువ్వు ఇలానే ఏమి తినకుండా బాధపడుతూ ఉన్నావంటే పైనుంచి చూస్తున్న మీ అమ్మమ్మ ఎవ్వరికి  చెప్పుకోలేక తను ఇంకా బాధపడుతుంది.మీ అమ్మమ్మను బాధపెడతవా..?? లేదు కదా..!! నువ్వు ఉదయం ఏమి తినలేదని స్వాతి చెప్పింది. నీకోసం నేను టిఫిన్ కూడా తెచ్చాను.నాకు ఆకలిగా ఉంది.నేను ఏమి తినలేదు తిందామా???
రమ్య:-సరే..!!!

    సాయంత్రం కాలేజీ నుండి వెళ్ళేటప్పుడు ఏదో ఆలోచిస్తూ రమ్యతో వెళ్తున్నాడు నడుస్తూ...
సుబ్బు:-రమ్య నీకు తోడుగా నీతో ఉండాలని నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
రమ్య:- ఇప్పుడు నేను ఉన్నాను అంటే అది నీకోసమే..నీ నిర్ణయని  నేను ఎలా కాదనగలను..కాకపోతే నా నిర్ణయం వినటానికి నావాళ్ళు లేరు సుబ్బు.
సుబ్బు:- అలా బాధపడకు రమ్య.ఇక నుండి నేను నీకు తోడు ఉంటాను..రేపు ఉదయం 11 గంటలకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో పెళ్లి చేసుకుందాము.
రమ్య:- మీ అమ్మ, నాన్నకు  తెలియకుండా ఎలా..?


సుబ్బు:- నిర్ణయం నేను తీసుకున్నాను.టైం వచ్చినప్పుడు వాళ్ళకు చెప్తాను.

మరుసటి ఉదయం సుబ్బు రమ్య ల పెళ్ళికి రమ్య వైపు స్వాతి పెళ్లి పెద్దగా,సుబ్బు వైపు నుండి తన ఫ్రెండ్స్ పెళ్లి పెద్దలుగా నిలిచి పెళ్లి జరిపిస్తారు.
  

         










PART-10
     రమ్య ని పెళ్లి చేసుకొని తోడుగా ఉంటాడు..

అలా నాల్గు నెలలు గడిచిపోతుంది.ఎగ్జామ్స్ దెగ్గర పడ్డాయి.బాగా చదివి ఎగ్జామ్స్ కుడా రాస్తారు..మొతానికి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి..

సుబ్బు:- రమ్య మన ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి.ను సరే అంటే ఆపై చదువుకోసం మనం లండన్ యునివర్సిటీ లో అప్లై చేస్దాము.నువ్వు ఏమంటావు రమ్య.
రమ్య:- వద్దు సుబ్బు మనం ఇక్కడే ఉందాము.ఇక్కడే ఉద్యోగం చేస్దాము.మన విషయం ఇంకా మీ అమ్మ నాన్న కు తెలియదు కదా.ఎలాగో ఎగ్జామ్స్ కూడా అయ్యిపోయాయి నువ్వు ఒకసారి వెళ్లి వాళతో మాట్లాడు.
సుబ్బు:- మాట్లాడటం కాదు రమ్య.డైరెక్ట్ గా తిసుకేల్తాను నువ్వు వచెయ్ రమ్య.
రమ్య:- లేదు సుబ్బు... నన్ను తీసుకెళ్ళి నాన్న నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్తే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు సుబ్బు.
సుబ్బు:- సరే ఇప్పుడు నేను ఏమి చేయమంటావు రమ్య.
రమ్య:- నువ్వు ఇంటికి చాలా రోజులతరువాత వెళ్తున్నావు.నువ్వు వస్తున్నావని  తెలిస్తే మీ ఇంట్లో వాలందరు  గుమ్మంలో ఎదురుచూస్తూ ఉంటారు.అదే ఇద్దరం వెళ్ళామంటే బుజం తట్టి లోపలి తీసుకేళ్లాలిసిన మీ నాన్న బంధాని తెంచుకుంటారు.చిన్నపుడే అమ్మ నాన్నని పోగొట్టుకున్నాను సుబ్బు.అమ్మ నాన్న ప్రేమని అత్తా మామ రూపం లో చూడాలని ఆశపడుతున్నాను సుబ్బు..నాకు ఆ నమ్మకం ఉంది.నా ఆశ నువ్వు నిజం చేస్తావని.
సుబ్బు:- నువ్వు మొండిదానివి రమ్య..మనకు నచింది చేస్తే కొంచం ఆనందం నలుగురికి నచింది చేస్తే చాలా ఆనందం అని నీద్వారా తెలిసింది. సరే రమ్య నేను రేపే ఇంటికి వెళ్తాను.నీ గురించి మా ఇంట్లో అమ్మ నాన్న కి చెప్పి నువ్వు ఆశపడుతున్న విధంగా కాదు నువ్వు కోరుకున్న  విధంగా నిన్ను మా ఇంటికి తిసుకేల్తాను రమ్య.సంతోషమా..??
రమ్య:- లవ్ యు.

 మరుసటిరోజు సుబ్బు వాళ్ళ ఊరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు.
సుబ్బు:- రమ్య....!!ఒక్కసారి ఆలోచించు.
రమ్య:- కుటుంబం అంటే మనమిద్దరం కాదు మనతోపాటు మనవాళ్ళు కూడా ఉండాలి సుబ్బు..


సుబ్బు:- సరే రమ్య...!! నీ సంతోషాని ఆనందాని నిజం చేయాలని నాకు ఎదురు రా....రమ్య.. ఇది ఇంటి నెంబర్.. ఈ నెంబర్ కి ఫోన్ చై...సరే మరి వేల్లోస్తాను..
రమ్య:-సరే సుబ్బు జాగ్రత్త.

     అలా బెంగుళూరు నుండి ఎర్రగుంట్లకు చేరుకుంటాడు..ఆ ఊరిలో వీళ్ళది పెద్ద కుటుంబం.తను వస్తున్నాడని తెలుసుకున్న వాళ్ళ ఇంట్లో సందడి మొదలయింది.ఆ ఊరిలో మంచి మహదేవ అయితే చెడ్డు నాగభూషణం.ఆ ఊరిలో తాత ముత్తాతల నుండి వస్తున్న పాత కక్షలు నాగభూషణం ఇంట్లో ఎదురుచూస్తున్నాయి సుబ్బు కోసం. నాగభూషణం..!! రేపో మాపో గాల్లో కలిసిపోయే ప్రాణం.అయినా ఆ ఊరిలో నాగభూషణం అంటే భయం.నాగభూషణం కొడుకు భగవంతుడు..చేయించేవాడు నాగభూషణం అయితే చేసేవాడు భగవంతుడు.భగవంతునికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు.తన పేరు నందిని..నందిని అంటే వాళ్ళ నాన్నకు పంచప్రాణాలు.తను అడిగిందంటే తన ప్రాణాలైన  ఇస్తాడు.అంత ప్రాణం తన కూతురు నందిని అంటే.

PART-11 
అలా బెంగుళూరు నుండి ఇంటికి వచ్చాడు..తనకోసం ఎదురుచూస్తున్న సుబ్బు అమ్మ సుమతి  ప్రేమ ఆప్యాయతను పొందుతాడు.
సుమతి:- ఏరా నానా...!! ఎలా ఉన్నావు.ఇలా చిక్కిపోయావెంది నానా..
సుబ్బు:- నేను బానే ఉన్నాను అమ్మ.ఇప్పుడు వచ్చేశాను కదా నీ వంటతో మల్లి నన్ను భీమున్ని చై.
సుమతి:-ఆపరా చాలు..ఎన్నిరోజులయింది ఇలా నీతో సంతోషంగా మాట్లాడి.అవును నీ ఫ్రెండ్స్ నీతో రాలేదే.?నువ్వు ఒంటరిగా వచ్చావే.?
సుబ్బు:-వాళ్ళు రావటానికి ఇంకా నాలగైదు రోజులు పడుతుంది..అవును..!! నాన్న ఎక్కడా..? ఇంకా గొడవలు అలానే ఉన్నాయా లేక.....
సుమతి:- స్వార్ధం కోసం అడవిలో ఏవరో మంట పెడతాడు.అలా అడవిమోత్తం కాలి బూడిద అవుతుంది.మీ నాన్న నన్ను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు.అప్పటినుండి నువ్వు పుట్టిన పది సంవత్సరాల వరకు ప్రతీకార యుద్ధాలే జరిగాయి.నీ 10వ సంవత్సరంలో నీ వల్ల మల్లి పూర్వ వైభవం వచ్చింది.కల బాగుంది అనుకున్నలోపే  తెల్లారవుతుంది.అలానే అంతా సంతోషంగా ఉందనుకున్నలోపే  మల్లి నీవల్ల ఓ ప్రతీకార యుద్ధమే మొదలయింది.అప్పటినుండి ఇప్పటివరకు అలానే ఉంది.
సుబ్బు:- అమ్మ...!! నువ్వు ఏమి చెప్పుతున్నావో అర్థం కాలేదు..ఇదంతా నావల్లనా...??
సుమతి:-మీ నైన(నాన్న) వస్తున్నాడు.ఇలా నీతో చెప్పానని తెలిస్తే నన్ను చంపేస్తాడు.
          ఇంతలో సుబ్బు వాళ్ళ నాన్నదుర్గాప్రసాద్ వస్తాడు.
దుర్గాప్రసాద్:- ఎప్పుడోచ్చావురా..?? పరిక్షలు బాగా రాశావా..??
సుబ్బు:- ఇప్పుడే వచ్చాను.బాగా రాశాను.
దుర్గాప్రసాద్:-సరే ఎప్పుడు తిన్నావో ఏమో..!! వెళ్లి తినుపో...సాయంత్రం అలా ఊరిలోకి  వెళ్దాము..సుమతి కాస్త మంచినీళ్ళు తీసుకురా.!!!!!!!
     వాళ్ళ నాన్నతో మాట్లాడి లోపలి వెళ్తాడు.భోజనం చేసి పడుకొని ఆలోచిస్తాడు.


సుబ్బు మనస్సులో :- నావల్ల గొడవలు అంటుంది ఏంటి అమ్మ.??పది సంవత్సరాల వయ్యసు అంటే ఏమి తెలియని వయ్యసు కదా.??అమ్మ కరెక్ట్ గా చెప్పే టైం కి నాన్న వచ్చారు..ఏమి అర్థం కావటం లేదు.నాతో రమ్మంటే ఎంతచెప్పినా రమ్య వినలేదు.తను ఎలా ఉందో ఎం చేస్తుందో..?? ఇక్కడంతా ఏదో కోతగా ఉంది.నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది..ఒక్కడినే బయటకు పంపరు.చుట్టూ పదిమంది.ఏంటి ఇదంతా.
  ఇంతలో..
దుర్గాప్రసాద్:- రేయ్...!! గిరి..
గిరి:- అన్నా.. చెప్పన్నా ..??
దుర్గాప్రసాద్:-అబ్బాయోచ్చాడు తెలుసుగా జాగ్రత.
గిరి:- మరేమీ పర్లేదన్నా..బాబు ఎక్కడికెళ్ళినా  తెలియకుండా మనోళ్ళు ఓ కన్నేసి ఉంటారు.

 ఇదంతా కిటికీ నుండి గమనిస్తాడు  సుబ్బు.
సుబ్బు మనస్సులో:- నిజమే ఏదో జరుగుతుంది.వెంటనే ఏంటో తెలుసుకోవాలి.ఎవ్వరు లేనప్పుడు అమ్మను అడగాలి లేదా గిరిని అడగాలి.గిరి ని అడగడమే మంచిది.


PART-12


?????????????????????????????????????


Saturday, December 31, 2011

రెండక్షరాల డబ్బు...”


“రెండక్షరాల డబ్బు...”
ఇరుమనస్సులను విడగొట్టి కట్టలుగా  మూటగడుతుంది,
స్వార్ధం,ద్వేషం,ద్రోహం మారుపేరుగా మారి డబ్బుగా మారింది,
ఎంతటి పనైనా క్షణాలో నింగి నుండి ఇళకు దించుతుంది,
చికటిరాజ్యం చరిత్రలో నిలిచిపోవాలని అధిపతిగా మారుతుంది,
పేదబ్రతుకులకు ఆకలితీర్చని ఆశనవుతుంది,
తప్పుచేసి బ్రతకమనే కోరికకు కర్తగామారుతుంది,
ఆత్మవిడిచిన దేహంపై మరళా కలవలేనని పలకరిస్తుంది..........
                                                                సుబ్బు